హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైడివాడ-లంకెలపాలెం రోడ్డు పనులు షురూ

AKP: సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం నుంచి లంకెలపాలెం వరకు ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి పనులు ప్రారంభమయ్యాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కృషితో పనులకు శ్రీకారం చుట్టినట్లు కూటమి నాయకులు తెలిపారు. మొదటి దశలో అసకపల్లి-పైడివాడ అగ్రహారం వరకు రూ.2.5 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం సీఎస్‌ఆర్‌ నిధులతో మిగతా రహదారి పనులు చేపట్టనున్నారు.