హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీడీఏ డీడీగా రజనికి ఇన్‌ఛార్జి బాధ్యతలు

PPM: పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ (డీడీ)గా గుమ్మలక్ష్మీపురం ఏటీడబ్ల్యూవో రజనికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు డీడీగా పనిచేసిన విజయశాంతి సోమవారం బదిలీపై రిలీవ్‌ అయ్యారు. ఇప్పటికే రజనికి విజయనగరం డీటీడబ్ల్యూవోగా అదనపు బాధ్యతలు ఉండగా, తాజాగా ఐటీడీఏ డీడీ బాధ్యతలు కూడా అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.