VSP: సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో మంగళవారం సహస్రనామార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో సహస్రనామార్చన చేశారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలంలో ఘనంగా సహస్రనామార్చన


