SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలను కమిషనర్ రవి మంగళవారం సందర్శించారు. కళాశాలలో నిర్వహించిన ఇన్‌స్టిట్యూషనల్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా వాష్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, తాగునీటి వసతులను పరిశీలించారు. కళాశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కమిషనర్ తనిఖీ


