హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకోవాలి: ఎక్సైజ్ సీఐ

NDL: కోవెలకుంట్ల ఎక్సైజ్‌ పరిధిలో మిగిలిన నాలుగు మద్యం దుకాణాలకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకోవాలని సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు. అక్టోబర్‌ 1 అర్ధరాత్రిలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కోవెలకుంట్ల-1, సంజామల-2, ఉయ్యాలవాడ-1 దుకాణాలకు ఆశావహులు ముందుకు రావాలని కోరారు.