హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగు

KDP: ప్రొద్దుటూరులోని స్థానిక బాలాజీనగర్‌కు చెందిన గొస్పాటి నారాయణమ్మ (75) మంగళవారం మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యుల సమ్మతితో పులివెందుల స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్రసేకరణ కేంద్రం ఆధ్వర్యంలో మృతురాలి కార్నియాలను సేకరించారు. కేంద్రం అధ్యక్షుడు రాజు నేత్రాలను సేకరించారు. నేత్రదానం ద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపవచ్చని రాజు తెలిపారు.