MDK: గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుల వల్లే ఇళ్ల కేటాయింపులో సమస్యలు వస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయంగా ఇళ్లు కేటాయిస్తామని, ఇళ్ల కోసం అధికారులు లేదా నాయకులు డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు. గత ప్రభుత్వ వైఫల్యాలకు తమను బాధ్యులను చేయవద్దని, ప్రజలు ఓపికగా ఉండాలని కోరారు.
తెలంగాణ
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయిస్తాం: ఎమ్మెల్యే


