హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోపాలపట్నంలో నేడు మెగా వైద్య శిబిరం

VSP: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా గోపాలపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ నివేదిత తెలిపారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, చిన్నపిల్లల వైద్యం, ఆర్థో, కంటి, దంత, చర్మవ్యాధులు, ఫిజియోథెరపీ, ఎక్స్‌రే, తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.