హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెల్ట్ షాపుపై దాడులు.. మహిళ అరెస్ట్

VZM: పూసపాటిరేగ మండలం గొల్లపేటలో అనధికార మద్యం దుకాణంపై మంగళవారం ఎక్సైజ్‌ CI రవికుమార్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 49 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, ఓ మహిళను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. అనధికార మద్యం విక్రయాలను ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా సూచించారు. బెల్ట్‌షాపుల సమాచారాన్ని అందిస్తే వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.