హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఒంగోలుకు 150 ఏళ్లు: కలెక్టర్

ప్రకాశం: ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బుధవారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు తెలిపారు. డ్యాన్స్ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్‌తో పాటు ఒంగోలులో అనేక ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఒంగోలు గిత్తల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నగర ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు.