హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థిపై సీనియర్ల దాడి

కర్నూలు నగరంలోని నారాయణ గాయత్రి కళాశాల బ్రాంచ్‌లో తన కొడుకుపై సీనియర్‌ విద్యార్థులు దాడి చేసినట్లు విద్యార్థి తల్లి ఆరోపించారు. కళాశాల గదిలో చీకట్లోకి తీసుకెళ్లి చితకబాదినట్లు తెలిపారు. నిన్న చిన్న గొడవ జరగడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినా.. మంగళవారం అదే విద్యార్థిపై సీనియర్లు మళ్లీ దాడి చేసినట్లు పేర్కొన్నారు.