VSP: విజయవాడలో న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాన్ని విశాఖ న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది. న్యాయవాది గవాస్కర్ పై రౌడీషీట్ తెరుస్తామని బెదిరించడం, ర్యాలీలో సీనియర్, మహిళా న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదని విశాఖపట్నం జిల్లా న్యాయవాదుల అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు అన్నారు. నిరసనగా బుధవారం జిల్లా కోర్టు వద్ద ధర్నా చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు న్యాయవాదుల ధర్నా


