హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వేస్టేషన్‌లో గంజాయితో మహిళ అరెస్ట్

SKLM: పలాస రైల్వేస్టేషన్‌లో 11 కిలోల గంజాయితో మహిళ అరెస్ట్ అయింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నుబహర్ బీబీ షేక్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేశారు. రెండు సంచుల్లో గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.