కృష్ణా: గన్నవరం నియోజకవర్గ వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ.. ఎమ్మెల్యే వెంకట్రావును కలిసి వినతిపత్రం అందించారు. రూ. 26 వేల వేతనం, ఉద్యోగ భద్రత, పదోన్నతులు, కారుణ్య నియామకాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, బీమా సదుపాయాలు కల్పించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి, అదనపు విధులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం వినతి


