హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంచినీటి సరఫరా అంతరాయం..!

కృష్ణా: గుడివాడ సత్యనారాయణపురం వద్ద జీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ ఎదురుగా పంపింగ్‌ మెయిన్‌కు లీకేజీ ఏర్పడింది. లీకేజీని అరికట్టేందుకు మున్సిపల్‌ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా నక్కల కాలువ, గుడ్‌మెన్‌పేట, ఆర్‌టీసీ కాలనీ, శాంతినగర్‌ వాటర్‌ ట్యాంకులకు బుధవారం మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు.