హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండాకు తెగులుకు శాస్త్రవేత్తల సూచన

కోనసీమ: కె.గంగవరం మండలం దంగేరు గ్రామంలో వరి పంటకు సోకిన ఎండాకు తెగులు ఉధృతిని ఏరువాక శాస్త్రవేత్త నందకిషోర్ మంగళవారం పరిశీలించారు. రైతు అయితాబత్తుల సతీష్ సాగు చేసిన పొలంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో పొలంలోకి వెళ్లి మొక్కలను పరిశీలించారు. ఎకరాకు 20 కిలోల పొటాషియం ఎరువు వేయాలని సూచించారు. ఏడీఏ నాగకుమార్, ఏవో సద్గురుమూర్తి పాల్గొన్నారు.