హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

NTR: వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో మంగళవారం సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. నందిగామ నియోజకవర్గంలో 276 మందికి రూ. 1.37 కోట్ల చెక్కులు మంజూరవగా వీరులపాడు మండలానికి చెందిన 60 మందికి రూ. 25,51,383 సాయం అందిందన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు.