హైదరాబాద్: 28°C
వ్యాపారం

విమాన టికెట్ ధర తగ్గితే రీఫండ్..!

విమాన టికెట్ ధరలు ప్రయాణానికి ముందు తగ్గితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేలా ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్‌ సంస్థ మేక్‌మైట్రిప్ 'ప్రైస్ డ్రాప్‌ ప్రొటెక్షన్' ఫీచర్‌ను తెచ్చింది. డొమెస్టిక్‌కు రూ.229, ఇంటర్నేషనల్‌కు రూ.349 అదనపు ఛార్జీతో ఈ సదుపాయం పొందవచ్చు. డొమెస్టిక్‌కు గరిష్ఠంగా రూ.5 వేలు, ఇంటర్నేషనల్‌కు రూ.6 వేల వరకు వాపసు ఇస్తారు.