BPT: మార్టూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో లంచం తీసుకుంటూ బొల్లాపల్లి వీఆర్‌వో చిన ఆంజనేయులు ఎసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూమి మ్యుటేషన్‌కు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు వీఆర్వో రూ.10 వేలు డిమాండ్ చేసి, రూ.9 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఎసీబీ అధికారులు, లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన వీఆర్వో


