హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

9 మంది సిబ్బందికి మెమోలు

సత్యసాయి: చిలమత్తూరు గ్రామపంచాయతీ పరిధిలోని 1, 2, 3 సచివాలయాల్లో సెప్టెంబరు 26, 28న విధులకు గైర్హాజరైన 9 మంది సిబ్బందికి అధికారులు మెమోలు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు రాలేదని పేర్కొంటూ మూడు రోజుల్లో లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఉద్యోగులు 27న విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు.