హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ తవ్వకాలతో కాజ్‌వేకు ముప్పు

ASR: అనంతగిరి మండలం ఎగువ నువ్వా గ్రామ సమీపంలోని కోస్తానీ నదిపై ఉన్న కాజ్‌వే కింద జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో నేలకోత ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తే కాజ్‌వే దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.