హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

W.G: ఇరగవరం మండలం గోటేరు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. పెనుగొండకు చెందిన పడాల రామకృష్ణారెడ్డి (48) కుమారుడిని తణుకులో బస్సు ఎక్కించి బైక్ పై తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో గోటేరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను తణుకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు SI తెలిపారు.