BPT: చీరాలలోని ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్ విద్యా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పాఠశాల కమిటీ ఛైర్‌పర్సన్‌గా గోపిశెట్టి సువర్ణ, వైస్ ఛైర్మన్‌గా జొన్నాదుల ధనుంజయుడు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ అభినందించారు. పాఠశాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని పాలకవర్గం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్ర రత్న హైస్కూల్ విద్యా కమిటీ ఎన్నిక


