MLG: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా క్రీడలు, పాటల పోటీలు నిర్వహించారు. జంగాలపల్లి, బండారుపల్లి పాఠశాలల్లో విద్యార్థులతో వయోవృద్ధులు మమేకమై తమ జీవిత అనుభవాలు, విలువలు, ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. వయోవృద్ధుల అనుభవాలు యువతకు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
ఆటపాటలతో వయోవృద్ధుల వారోత్సవాలు


