హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమల కాలనీలో డ్రైనేజీ సమస్యలతో అవస్థలు

WNP: తిరుమల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో దోమలు, ఈగలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. వర్షం కురిసినప్పుడు ఇళ్ల ముందు మురుగునీరు నిలిచి దుర్గంధం వస్తోందన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు పుర అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.