KRNL: ఆలూరు మండలంలోని నేరణికి తండా సమీప కొండ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 10 బిందెల్లోని 150 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ లలితాదేవి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
10 బిందెల బెల్లం ఊట ధ్వంసం


