ASR: చింతపల్లి మండలం మల్లవరం గ్రామంలో మంగళవారం ఏడీఏ బీవీ తిరుమలరావు, ఏవో టీ.మధుసూదనరావు పర్యటించారు. ఈ సందర్భంగా వరి, వేరుశనగ, రాగి పంటలను పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో పంటల పరిస్థితిని రైతులతో కలిసి పరిశీలించారు. పంటల పోషక యాజమాన్యం, అధిక దిగుబడుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. వరి పంటకు ఎకరాకు 10-20 కిలోల యూరియా వినియోగించాలని రైతులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారులు


