హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక రీచ్‌లను పరిశీలించిన అధికారులు

NRPT: మాగనూరు మండలంలోని వర్కూర్, అమ్మపల్లి, వాడ్వాట్ గ్రామాల్లో మంగళవారం మాగనూరు ఎస్సై అశోక్ బాబు, రెవెన్యూ ఆర్‌ఐ సుధాకర్ రెడ్డి, మైనింగ్ ఆర్‌ఐ రాజారెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఇసుక రీచ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి తవ్వకం, నిల్వ, రవాణా రికార్డులను తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.