హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన భీమవరం జర్నలిస్టులు

W.G: కాళ్ల మండలం పెదమిరంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామను భీమవరం మీడియా క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. క్లబ్ అధ్యక్షుడు ఆరేటి శ్రీనివాస్, కార్యదర్శి లింగమూర్తి ఆయనకు శాలువా కప్పి పూల బొకే అందించారు. అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యల పరిష్కారంపై డిప్యూటీ స్పీకర్ సానుకూలంగా స్పందించారు.