GNTR: తెనాలి రూరల్ పీఎస్ పరిధిలోని కుచిపూడి–పెదరవూరు రహదారిపై ఈనెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో అమృతలూరి రమాదేవి (53) మృతి చెందారు. వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు రోడ్డుపై పడగా, మహిళపై నుంచి కారు వెళ్లి ఆగకుండా వెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసి, డ్రైవర్ అషీర్‌బాబును మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


