W.G: కేంద్ర ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు మాని, రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ డిమాండ్ చేశారు. మంగళవారం భీమవరంలోని BJP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 13 కోట్ల ఓట్ల తొలగింపు ప్రచారం పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడితే ఈసీ తప్పనడం విపక్షాల ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: భూపతిరాజు


