TPT: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ రెండు రోజుల్లో సామాన్య భక్తులకు సాఫీగా దర్శనం కల్పించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో అక్టోబర్ 1, 5న వీఐపీ దర్శనాలు రద్దు


