హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై: అజయ్ కుమార్

TPT: సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం సాయంత్రం ఎస్సై అజయ్ కుమార్ వాహనాలు తనిఖీ చేశారు. లైసెన్స్, ధ్రువపత్రాలు లేని వారికి జరిమానా విధిస్తామన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ విధిగా వాడాలని, మద్యం తాగి నడిపితే రూ.10 వేలకు పైగా జరిమానాతో పాటు కోర్టుకు పంపుతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు.