హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు ఓరియెంటేషన్ కార్యక్రమం

ASF: ఆసిఫాబాద్ డివిజనల్ రిసోర్స్ సెంటర్‌లో ప్రీ-ప్రైమరీ పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్ల కోసం ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈవో వాసాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. చిన్నారులను ఆకట్టుకునేలా ఆటపాటలు, కథల మాధ్యమంగా పాఠాలు చెప్పే బోధనా పద్ధతులపై శిక్షణ అందించారు. డీసీఈబీ సెక్రటరీ జి. హనుమంతు, ఏఎంవో కొయ్యాడ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.