హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారికి అష్టదళ పద్మారాధన

విశాఖ బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం అష్టదళ పద్మారాధన సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. ఈ సేవలో ఉభయదాతలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.