హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలి'

HYD: ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో గుండె ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మల్కాజ్‌గిరి డీసీపీ శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గుండె ఆరోగ్యం, ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన వివరించారు.