హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెచ్చులు ఊడుతున్న సచివాలయం

పార్వతీపురం మండలం కోరిగంగాపురం గ్రామ సచివాలయం భవనం పెచ్చులు ఊడిపోతుండటంతో సిబ్బంది, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం సచివాలయాన్ని పరిశీలించిన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పెనుగుర్తి సంఘం ఈ విషయాన్ని తెలిపారు. నూతన సచివాలయ భవనం నిర్మాణం పూర్తయినా ప్రారంభించకపోవడంతో పాత భవనంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.