హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్న కారణాలతో రుణాలు ఆపొద్దు: కలెక్టర్

W.G: 'ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త' లక్ష్య సాధనకు రుణాలు మంజూరు చేయడంలో జాప్యం చేయవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. చిన్నచిన్న కారణాలతో దరఖాస్తులు తిరస్కరించొద్దని అధికారులను, బ్యాంకర్లను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లో మంగళవారం వివిధ శాఖలతో సమీక్షించారు. 15 రోజుల్లోగా లక్ష్యాలు సాధించి మెరుగైన ఫలితాలు చూపాలని తేల్చిచెప్పారు.