హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి’

BDK: న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన దళిత,ఆదివాసీ ఆత్మగౌరవ సభలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అవసరమైన వసతి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.