హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొండవాడ హైస్కూల్లో ఉద్రిక్తత

TPT: చంద్రగిరి మండలం తొండవాడ హైస్కూల్లో పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికకు రాజకీయ రంగు పులుముకోవడంతో వైసీపీ, టీడీపీ నాయకులు పాఠశాల సమీపంలో హడావిడి చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.