అన్నమయ్య: మదనపల్లిలో అక్టోబర్ 2న సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో ప్రజావేదిక కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. హెలిప్యాడ్, పార్కింగ్, తాగునీరు, వైద్యం, భోజనం, భద్రత, ట్రాఫిక్ తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లికి సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్ రాక


