హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోంపేటలో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతం

SKLM: సోంపేట మండల పరిధిలోని 78 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎంఈవో జోరోడు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో 13 పాఠశాలల్లో ఓటింగ్ ద్వారా, 65 పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లు ఎన్నికయ్యారు.ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పారదర్శకంగా ముగిసిందని, సహకరించిన హెచ్ఎం, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.