ఆసియా క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో ఇండియాకు మరో స్వర్ణం దక్కింది. మహిళల 4X400 మీటర్ల రిలే విభాగంలో భారత్‌కు స్వర్ణం లభించింది. కిరణ్ పహల్, పూవమ్మ మచెట్టిర, ప్రాచి, విత్యరామ్ రాజ్‌లతో కూడిన టీమ్.. 3:29.69 నిమిషాల్లో రిలే పూర్తి చేసి స్వర్ణం అందుకుంది. బహ్రెయిన్ రజతం, చైనా కాంస్య పతకాన్ని దక్కించుకున్నాయి.
క్రీడలు
ఆసియా క్రీడలు: భారత్‌కు మరో స్వర్ణం


