విజయనగరం పోలీస్ మైదానంలో మంగళవారం ఏపీఎస్పీ స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, పోలీసు కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
గౌరవ వందనం స్వీకరించిన మంత్రి


