హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజమండ్రి మేయర్ సీటు మాదిగలకు కేటాయించాలి'

E.G: రాజమండ్రి కార్పొరేషన్ మేయర్ సీటును మాదిగలకు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నేత ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. గత 80 ఏళ్లుగా మాదిగలకు సరైన రాజకీయ అవకాశాలు దక్కడం లేదన్నారు. కూటమి విజయానికి కృషి చేసిన మాదిగలకు మేయర్ పదవి కేటాయించి రుణం తీర్చుకోవాలని కోరారు.