హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమిలిలో పల్లె పండుగ పనులు

VSP: ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో రూ.37 కోట్లతో పల్లె పండుగ-3.0 అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు, మినీ గోకులాలు, ఉద్యానవనాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తామని చెప్పారు. అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామని తెలిపారు.