ELR: ప్రతి ఉద్యోగికి తమ సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్, జెడ్పీ ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బదిలీపై వచ్చిన ఉద్యోగులకు సీట్లు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, తక్షణమే కేటాయింపులు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి'


