హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ రూరల్లో ఇంకా తగ్గని వరద ముంపు

కాకినాడ రూరల్, సర్పవరం తదితర ప్రాంతాల్లో వరదనీరు తగ్గకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు రోజులుగా ముంపు పరిస్థితి కొనసాగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆయా ప్రాంతాలను సందర్శించి వరద ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు స్థానికులు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదన్నారు.