హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ డివిజన్‌లో భద్రతా తనిఖీలు

VSP: దక్షిణ మధ్య సర్కిల్ రైల్వే భద్రత కమిషనర్ మాధవి మంగళవారం విశాఖ డివిజన్‌లో పర్యటించి భద్రతా తనిఖీలు నిర్వహించారు. విశాఖ నుంచి కోనేరు టౌన్ వరకు నార్త్ సింహాచలం క్యాబిన్ వద్ద ఎల్‌సీ గేటు, మిడ్ సెక్షన్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆమె వెంట డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రాతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.