హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసుల పురోగతిపై ఆరా తీసిన ఎస్పీ

BHPL: మహాముత్తారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి, కేసుల వివరాలు, రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలు, శాంతిభద్రతల పరిరక్షణపై సమీక్షించారు.